బాసు నాంచారయ్య నాయుడుకు జనసేన నాయకుల పరామర్శ

భారత్ న్యూస్ తిరుపతి…బాసు నాంచారయ్య నాయుడుకు జనసేన నాయకుల పరామర్శ

అవనిగడ్డ:
ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గారైన,జనసేన పార్టీ లీగల్ సెల్ సెక్రెటరీ , ప్రముఖ న్యాయవాది బాసు నాంచారయ్య నాయుడు గారిని శనివారం నియోజకవర్గ జనసేన నాయకులు ఘంటసాల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ గారు, మరియు కోడూరు మండల జనసేన నాయకులు పరామర్శించారు. నాంచారయ్య నాయుడు గారికి ఇటీవల కాలికి లెగ్మెంట్ ఆపరేషన్ చేయించుకుని అవనిగడ్డలోని వారి ఇంటి వద్ధ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.