భారత్ న్యూస్ అనంతపురం .. .చల్లపల్లి లో
హరిహర వీరమల్లు సందడి చేసిన జనసేన నేతలు….
మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23 వ తేదీ రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమల సినిమా థియేటర్ వద్ద సినిమా ఘన విజయం సాధించినందుకు అభిమానులు కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ కు అభివందనాలు తెలియజేశారు.
చల్లపల్లి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వీరబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా తీన్మార్ డప్పులతో సందడి చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కొడాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ కనకదుర్గ, అడపా రవి , జనసేన నాయకులు వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం జనసేన యువనాయకులు మండలి వెంకట్రావు సహకారంతో చిత్ర విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింద
