భారత్ న్యూస్ రాజమండ్రి….గ్రూప్ 1 అధికారి కె.కృష్ణప్రసన్నకు ఐపీఎస్ హోదా
రాష్ట్రంలో 2010వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన గ్రూప్ 1 అధికారి కె.కృష్ణప్రసన్నకు ఐపీఎస్ హోదా లభించింది.
రాష్ట్రానికి చెందిన 14మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా ఇచ్చేందుకు ఆమోదించారు. వీరిలో ప్రస్తుతం విజయవాడ సీఐడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న కె.కృష్ణ ప్రసన్నకు ఐపీఎస్ హోదా లభించింది!
రాష్ట్రంలో గ్రూప్ 1 ద్వారా ఎన్నికైన 14మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా ఇచ్చేందుకు యూపీఎస్సీ నిర్ణయించింది.
ఈ విషయమై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ విజయానంద్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ యూపీఎస్సీ, డిఓపిటి అధికారులతో అధికారులతో సమావేశమై చర్చించారు.
