భారత్ న్యూస్ శ్రీకాకుళం…Ammiraju Udaya Shankar.sharma News Editor…కూటమి నాయకులకు ఆహ్వానం
రాష్ట్రంలో ఎన్.డీ.ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవనిగడ్డలోని ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి కార్యాలయంలో “సుపరిపాలనలో తొలి అడుగు” వేడుకలు పురస్కరించుకొని కేక్ కటింగ్, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గార్ల చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరుగును.
కావున నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మండల, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పీసీ, డీసీ చైర్మన్లు, ఆరు మండలాల నీటి సంఘాల అధ్యక్షులు, తెలుగు మహిళలు, వీర మహిళలు, మహిళా మోర్చా నాయకులు, ఆయా పార్టీల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో విచ్చేయగలరని విజ్ఞప్తి.
