భారత్ న్యూస్ గుంటూరు…అమల్లోకి వచ్చిన ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాత్రి సమయాల్లో పనిచేసేందుకు మహిళలకు అనుమతి.
ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని విధానాన్ని కొనసాగిస్తూనే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి పెంచారు.
ప్రస్తుతం వారానికి 14గంటలు ఓవర్ టైం ఉండగా.. దీన్ని మూడు నెలలకు 144 గంటలుగా నిర్ణయించారు.
రాత్రి సమయాల్లో పని చేసేందుకు మహిళలకు అనుమతించారు. మహిళా సిబ్బంది సమ్మతితో రాత్రి 8గంటల నుంచి ఉదయం 6గంటల వరకు పనికి అనుమతించేలా చట్ట సవరణ చేశారు.
రాత్రి విధుల్లో వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలి. 20 మంది లోపు సిబ్బంది ఉన్న సంస్థలకు కొన్ని రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చారు.

సిబ్బంది రిజిస్ట్రేషన్, రెన్యూవల్, సెలవులు, తొలగింపు లాంటి రిజిస్టర్లను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది