భారత్ న్యూస్ విజయవాడ…
బంగారం దుకాణాల్లో తనిఖీలు
నరసరావు పేట లో
బంగారం దుకా ణాల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జాయింట్ కంట్రోలర్ ఎం. ఎల్.ఎస్. మాధురి, నరసరా వుపేట ఇన్ఛార్జి అసిస్టెంట్ కంట్రోలర్ సునీల్ రాజ్, ఇన్ స్పెక్టర్ శ్రీకర్ తనిఖీల్లో పాల్గొన్నారు. బంగారం కొనుగోలు చేసిన వారికి ఇచ్చే బిల్లుల్లో రాళ్లు, బంగారం బరువు కలిపి రాస్తుండటాన్ని గుర్తించి
(తూకం వేసే కాటా పరిశీలిస్తున్న జాయింట్ కంట్రోలర్ మాధురి)

మూడు దుకాణాల పై కేసులు నమోదు చేశారు. జాయింట్ కంట్రోలర్ మాధురి మాట్లాడుతూ రాళ్ల బరువు, బంగారం బరువు కలిపి రాయడం నేరమని, రాళ్లలో కొన్ని విలువైనవి ఉంటాయని, కొన్ని విలువ లేనివి ఉంటా యని, రెండు కలిపి బిల్లు రాస్తే కొనుగోలుదారులు నష్టపోయే ప్రమాదం ఉంద న్నారు. కొనుగోలుదారుల్ని మోసం చేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…