పోలవరానికి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో,

భారత్ న్యూస్ విశాఖపట్నం..పోలవరానికి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

స్పిల్ వే వద్ద నీటిమట్టం 27.230 మీటర్లకు చేరడంతో 48 గేట్లు ఎత్తి 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

వరద ప్రవాహం పెరగడంతో పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు (ప్రకాశం బ్యారేజీ) నీరు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.