భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
అదనంగా విధించిన రూ.15వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణం ఉపసంహరించుకోండి.
గోరంత చేసి కొండత చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెల్లుతుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలపై మోపిన ట్రూ అప్ భారం రూ.15,780 కోట్లు.
ఇప్పుడు ట్రూ డౌన్ తో తగ్గిన భారం కేవలం రూ.923 కోట్లు.
2024- 25 వార్షిక సంవత్సరానికి సర్దుబాటు పేరుతో అదనంగా దోచిన రూ.923 కోట్లను ..
తిరిగి చెల్లించండని ERC మొట్టికాయలు వేస్తే,
అదేదో కూటమి ప్రభుత్వం ఛార్జీలు తగ్గించిందని,
వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చామని,
సమర్ధత, అనుభవం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఎన్నికల్లో ఛార్జీల తగ్గింపు హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించుకోవడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్.
నిజంగా చంద్రబాబు గారికి విద్యుత్ చార్జీలపై చిత్తశుద్ధి ఉంటే ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి.
అమలవుతున్న ఛార్జీల్లో 30 శాతం మేర ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి.
