భారత్ న్యూస్ గుంటూరు….గిరిజన హాస్టల్లో వార్డెన్ నిర్వాకం
సరుకులు మస్తు – పిల్లలకు మాత్రం పస్తు
అక్రమంగా తరలిపోతున్న సరుకులు
అడ్డుకున్న జన సైనికులు
వేలేరుపాడు మండలంలోని శివకాశీపురంలో గల ప్రభుత్వ బాలికల గిరిజన వసతి గృహంలో వార్డెన్ చేతివాటం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పిల్లలకు పెట్టాల్సిన కందిపప్పు, బియ్యం, కోడిగుడ్లు, నూనె తదితర సరుకులను రాత్రి సమయంలో అక్రమంగా తరలించుకుపోతూ బాలికలను పస్తు పెడుతున్నారు.

ఇది గమనించిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ, నాయకులు దేవిరెడ్డి సుధాకర్, మాచర్ల వెంకటేశ్వర్లు పకడ్బందీగా మాటు వేసి ఒక ప్రయివేట్ వాహనంలో (AP 37 CM 5140) రాత్రి 10.30 నిమిషాల సమయంలో అక్రమంగా రవాణా అవుతున్న సరుకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్థానిక రెవిన్యూ, పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు.