భారత్ న్యూస్ గుంటూరు…..నిమ్మగడ్డ లంకలో జోరుగాఇసుక.మట్టి అక్రమ రవాణా
జెసిబి లు ట్రాక్టర్లతో తరలింపు
పట్టించుకోని అధికారులు
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, పూరిటిగడ్డ గ్రామపంచాయతీ శివారు నిమ్మగడ్డకు చెందిన లంక భూముల్లోని జోరుగాఇసుక, మట్టిని రవాణా చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి తెల్లవారులు ట్రాక్టర్ ట్రక్కుల్లో లోడు చేసి తరలిస్తున్నారు. సి ఆర్ జెడ్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇసుక బుసక మట్టి వంటివి తరలించకూడదని గతంలోనే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. నదీ గర్భంలో ఉన్న ఈ లంక భూములను సొసైటీ కింద రైతుల సాగు చేసుకుంటున్నారు. తరచూ వచ్చే వరదల కారణంగా మట్టి కొట్టుకుపోతుంది. దీనివల్ల వల్ల క్రమంగా ఈ లంక పరిధి తరిగిపోతుంది. లంక అంచుల వెంబడి భూములు కల రైతులు తమ పొలాలను కోల్పోతున్నారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా గురువారం రాత్రి నుంచి అక్రమ మట్టిఇసుక ఈ లంక నుంచి తరలించుకుపోవడంతో నిమ్మగడ్డ లంక మనుగడకు భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. గురువారం సాయంత్రం నుంచే పులిగడ్డ- విజయవాడ కరకట్టపై నిమ్మగడ్డ వద్ద నుంచి రేవులోని లంక వరకు దారులు కూడా వేసినట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయిన తర్వాత జెసిబి లు లంకలోకి తరలించి అక్కడ మట్టినిఇసుక ను ట్రాక్టర్లతో నింపి తరలించుకుపోతున్నారు. కొన్ని రోజులపాటు ఈ మట్టి తరలింపును చేసుకునేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని, సి ఆర్ జెడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
