అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

భారత్ న్యూస్ గుంటూరు…..అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను అనుమతించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్‍పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించిన ధర్మాసనం.. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలన్న ధర్మాసనం..