మోపిదేవి దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మోపిదేవి దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు.
కృష్ణా జిల్లా:/మోపిదేవి

రాష్ట్రంలో భూ వ్యవహారాల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, రెవెన్యూ శాఖలో అవినీతి పెచ్చుమీరడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భూ సమస్యల పరిష్కారంలో స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం ఆదేశాలు పట్టించుకోని అధికారులు

ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి భూముల వివాదాల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూ కబ్జాలు, అవినీతి చర్యలపై అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు తహసీల్దార్లు ఈ ఆదేశాలను విస్మరిస్తూ తమ స్వేచ్ఛానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మోపిదేవిలోని దేవస్థాన భూములపై అక్రమాలు .

కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామి దేవస్థానం కు చెందిన భూముల విషయంలో తీవ్ర అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. సర్వే నం. 633లో ఉన్న దేవస్థాన భూమిని ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా మార్చుతూ స్థానిక తహసీల్దార్ ఆమోదం ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది.
రెవెన్యూ రికార్డులు ఆ భూమి ప్రభుత్వ/దేవాదాయశాఖకు చెందినదిగా స్పష్టం చేస్తున్నప్పటికీ, అనుభవదారుడిగా మరో వ్యక్తిని గుర్తిస్తూ సర్టిఫికెట్ జారీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమి ని స్వాదీనం చేసుకోవాలి.-ఏపీ హై కోర్టు

ఈ అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో, ప్రభుత్వ భూమి రక్షణ కోసం పిటీషనర్ బాల దుర్గా రామ ప్రసాద్ ఏపీ హై కోర్టు ను ఆశ్రయించారు. డబ్యూ .పి (పిల్ ) No 76/2026గావిచారణ కు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, గతంలో ఇచ్చిన డబ్యూ .పి (పిల్ ) No. 140/2022 ఉత్తర్వులు ఈ కేసుకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
అక్రమ నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.