IAF అగ్నివీర్.. ఆగస్టు 4 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

భారత్ న్యూస్ విశాఖపట్నం..IAF అగ్నివీర్.. ఆగస్టు 4 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

IAFలో అగ్నివీర్ నియామకాల దరఖాస్తు గడువును పొడిగించారు.

జులై 31తో దరఖాస్తు గడువు ముగియగా, ఆగస్టు 4వ తేదీ వరకు పొడిగించారు.

02-07-2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించిన పెళ్లికాని వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

10+2/డిప్లొమా, ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌తో పాటు మొత్తం 50% మార్కులు పొందిన వారు రూ.550 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.