భారత్ న్యూస్ రాజమండ్రి…తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రంలో దారుణం జరిగింది.
ఓ యువకుడు పదో తరగతి చదువుతున్న బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు సతీశ్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు.
భయపడిన బాలిక ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పగా, వారు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి కోరుతున్నారు…
