సచివాలయం.. HOD టవర్లకు టెండర్లు ఖరారు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర ప్రదేశ్ :

సచివాలయం.. HOD టవర్లకు టెండర్లు ఖరారు

అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ టవర్ల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. HOD కార్యాలయాల జీఏడీ టవర్ నిర్మాణ టెండర్లను NCC Ltd రూ.882.47 కోట్లకు దక్కించుకుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1, 2 HOD టవర్ల నిర్మాణ పనులను రూ.1487.11 కోట్లతో షాపూర్ జీ పల్లోంజి సంస్థ దక్కించుకుంది. HOD 3, 4 టవర్ల నిర్మాణ పనులను రూ.1303.85 కోట్లతో లార్సెన్ అండ్ టౌబ్రోLtd సంస్థ చేపట్టనుంది.