హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీక

భారత్ న్యూస్ రాజమండ్రి ….హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీక

అవనిగడ్డ డిఎస్పి టి విద్యశ్రీ

చల్లపల్లిలో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమలు పంపిణీ

చల్లపల్లి:
వినాయక పర్వదినం సందర్భంగా ముస్లిం మత పెద్దల చేతుల మీదుగా అన్నాయికును ప్రతిమలు పంపిణీ చేయడం మతసామరస్యానికి ప్రతీక అని అవనిగడ్డ పిఎస్పీ తాళ్లూరు విద్యాసరి అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక లైన్స్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పి టి విద్యశ్రీ చేతుల మీదగా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చల్లపల్లి సిఐ కే ఈశ్వరరావు పర్యవేక్షణలో, ఎస్ ఐ పి ఎస్ వి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు చల్లపల్లి పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు నసీం ఘోరీ, సెక్రటరీ అబ్దుల్ అహ్మద్ జానీ, అబ్దుల్ గఫర్, అబ్దుల్ అర్షద్, మహమ్మద్ కరీముల్లా, అబ్దుల్ రహీం, హమీద్, షేక్ సిలార్, ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ అన్వర్ బాసు, గయాస్, రఫీ, సమీర్ తదితర ముస్లిం పెద్దలు పాల్గొని 400 విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ మాట్లాడుతూ ఒకరికొకరు సోదర భావాన్ని పెంపొందించుకొనేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ సంప్రదాయాన్ని మునుముందు కూడా కొనసాగించాలని కోరారు.