భారత్ న్యూస్ విశాఖపట్నం..హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం (Surface trough effect)తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
ఈ రోజు ద్రోణి మరింత బలపడనుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ (Department of Meteorology) ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ వంటి తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే మిగిలిన జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

హైదరాబాద్ ప్రజలకు కీలక సూచన
గురువారం సాయంత్రం నుంచి రాత్రి 12 వరకు హైదరాబాద్ నగర (Hyderabad city) వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ (Cloud Burst)ను తలపించేలు కుండపోత వర్షం (Torrential rain) కురవడంతో రోడ్లున్న చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు నగరంలో నిన్నటి పరిస్థితులు ఉండవని వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం – రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇందుకు అనుగుణంగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవాలని అలర్ట్ జారీ చేశారు.