భారత్ న్యూస్ రాజమండ్రి…నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేడు(బుధవారం) భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. అయితే మరో రెండు రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా తప్పుకునే అవకాశం ఉందని, ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయని చెప్పింది. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD పేర్కొంది….