భారత్ న్యూస్ అనంతపురం…అనంతపురం HDFC బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన

Ammiraju Udaya Shankar.sharma News Editor…అనంతపురం టౌన్ లో రాంనగర్ లోని హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంకులో 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం మాయమైంది.
ఈ బంగారాన్ని బ్యాంకు ఉద్యోగులే కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టారు.
