భారత్ న్యూస్ మంగళగిరి…హంద్రీనీవా నీటి విడుదల కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల సంచలన వ్యాఖ్యలు.
జగన్‍కు సవాల్ చేస్తున్నాం. జగన్‍కు దమ్ముంటే రాయలసీమ అభివృద్ధిపై చర్చకు రావాలి. హంద్రీనీవా కాలువ గట్టుపై జగన్ చర్చకు రావాలి. రాయలసీమ తలరాతను మార్చడానికి ఆనాడు ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారు. ఆ బాధ్యతను సీఎం చంద్రబాబు పూర్తిచేశారు. సీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. రాయలసీమలో జగన్ పాలెగాళ్ల రాజ్యం తేవాలని కుట్రలు. రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలి? – మంత్రి పయ్యావుల కేశవ్
