భారత్ న్యూస్ అనంతపురం,హెయిర్ డై తాగి నలుగురు విద్యార్థినుల ఆత్మహత్యా యత్నం.. ఏపీలో షాకింగ్ ఘటన!
అనంతపురం జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. వీరు నలుగురు హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.
బాలికల ఆత్మహత్యా యత్నానికి కారణం ఇదే
తల్లిదండ్రుల మందలింపుతో మనస్థాపానికి గురైన నలుగురు బాలికలు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటన పైన స్థానికులు కేసు నమోదుచేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సాధారణమైన విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆత్మహత్యకు ప్రేరేపించేలా వస్తున్న ఆలోచనలు వంటి కారణాలతో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు.