భారత్ న్యూస్ విజయవాడ..జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

Ammiraju Udaya Shankar.sharma News Editor…గిన్నిస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినే వాళ్లం..ఇప్పుడు భారత్ లో అందీ ఏపీలో నమోదవుతున్నాయి.. రహదారుల నిర్మాణంలో గడ్కరీ రికార్డులు సృష్టిస్తున్నారు .. రహదారుల నిర్మాణం దేశ ప్రగతికి కీలకంగా మారుతుంది..ఏ పనులు రాత్రికి రాత్రి పూర్తి కావు.. అన్ని వ్యవస్థలూ ఇంటిగ్రేట్ కావాలి.. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. అన్ని రంగాల్లో పనితీరు బేరీజు వేస్తున్నాం.. వచ్చే నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి జీఎస్డీపీ అంశాలను మరోసారి పరిశీలిస్తాం.. పది సూత్రాల అమలు పర్యవేక్షణకు అధికారులను టాస్క్ ఫోర్స్ గా ఏర్పాటు చేశాం.. కొత్త ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంలేదు.. దీనిపై దృష్టి పెట్టాలి.. డూ ఆర్ డై విధానంలో కేంద్ర నిధులు ఖర్చు చేయాలి.. పీపీపీ విధానం ద్వారా వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలి.. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైబ్రిడ్ రహదారుల అంశంపై ప్రణాళిక చేపట్టాలి.. అన్ని మేజర్ పారిశ్రామిక ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ప్రజల్లో సానుకూలత మరింత పెరగాలి : సీఎం చంద్రబాబు

