కేంద్రం గొప్పలు.. తగ్గని ధరలు!

భారత్ న్యూస్ గుంటూరు…కేంద్రం గొప్పలు.. తగ్గని ధరలు!

ఎక్కడా కనిపించని జీఎస్‌టీ కొత్త రేట్లు
నిత్యావసరాలు, మందుల ధరలు యథాతథం
ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపు ప్రభావం శూన్యం
తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన వాహనాల ధరలు
లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో కీలక విషయాలు వెల్లడి.

దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలు సెప్టెంబర్‌ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు. భారతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తుందని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలు 2.0 ఆచరణలో మాత్రం నత్త నడకను తలపిస్తున్నాయి.

జీఎస్‌టీ రేట్లు 5 శాతం, 18 శాతానికి తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువులు, మందుల ధరలతోసహా అనేక వస్తువుల ధరలు తగ్గిపోయి వినియోగదారులకు భారీ ఊరట లభిస్తుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. యువత ప్రమేయం అధికంగా ఉండే రంగాలైన ఆటోమొబైల్స్‌, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార తయారీ, టెక్నాలజీ వంటి రంగాలలోజీఎస్‌టీ సంస్కరణల కారణంగా ఖర్చులు బాగా తగ్గి పోటీ తత్వాన్ని పెంచి సృజనకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రజలు ఆశించారు.