భారత్ న్యూస్ గుంటూరు….నారా లోకేష్‌తో బొబ్బా గోవర్ధన్ కీలక భేటీ..!
–అవనిగడ్డ రాజకీయాలపై చర్చ..??

Ammiraju Udaya Shankar.sharma News Editor…అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్‌ను అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు, ఎన్నారై వ్యాపారవేత్త బొబ్బా గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో లో వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో జరుగుతున్న సమావేశాల సందర్భంగా, అమెరికాలో పలు రాష్ట్రాల్లో విజయవంతమైన రెస్టారెంట్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న బొబ్బా గోవర్ధన్ లోకేష్‌ను కలసి, తన వ్యాపార రంగ అనుభవాలను వివరించారు. సామాన్య ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, వ్యాపార రంగంలో గణనీయమైన స్థాయికి ఎదిగిన గోవర్ధన్ ప్రయాణాన్ని లోకేష్ ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణపై ఇద్దరి మధ్య స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది.
