భారత్ న్యూస్ రాజమండ్రి…అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్!
అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో అంగన్వాడీలకు వేసవి సెలవులను 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలని, ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీల నిరంతర కృషి వల్లే ‘పోషణ్ అభియాన్’లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి వారిని కొనియాడారు.
