అవనిగడ్డ: లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలు

భారత్ న్యూస్ రాజమండ్రి…అవనిగడ్డ: లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గంలో మిక్కిలి భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించిన శిలువ యాత్ర భక్తుల ప్రార్థనలతో మారుమోగింది.ఈ వేడుకల్లో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొని తన భక్తిని చాటుకున్నారు. క్రీస్తు అనుభవించిన శ్రమలను స్మరిస్తూ, శిలువను భుజాన ధరించి యాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఆయన చూపిన ప్రేమ, క్షమ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఈ పవిత్రమైన రోజున శిలువ యాత్రలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.