పసిడి, వెండి పరుగులు..

భారత్ న్యూస్ విజయవాడ…పసిడి, వెండి పరుగులు..

డిసెంబర్ 29వ తేదీ సోమవారం ధరలు ఇవే..!!

నేడు డిసెంబర్ 29వ తేదీ సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి సంచలనం సృష్టించాయి. బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,135గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,147 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధరలు మరింత దూకుడుగా కదిలాయి. ఒక కిలో వెండి ధర రూ.2,53,922కి చేరి చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిని తాకింది.