కోడూరులో మోటర్ల దొంగల ముఠా అరెస్టు..!

భారత్ న్యూస్ గుంటూరు…..కోడూరులో మోటర్ల దొంగల ముఠా అరెస్టు..!

కోడూరు మండల పరిధిలో పలుచోట్ల ఆక్వా చెరువులపై మోటర్ లు దొంగతనం చేస్తున్న ముఠాని పోలీసులు అదుపులోకి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం మోటర్లు దొంగలించి అవనిగడ్డ తీసుకు వెళుతున్న పిట్టలంక గ్రామానికి చెందిన శీలం కల్యాణ్ రాయ్, బావి శెట్టి వారి పాలెం గ్రామానికి చెందిన,సింగంశెట్టి సాయి శ్రీనివాసరావు విశ్వనాధపల్లి గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు శనివారం కోడూరు ఇన్చార్జి ఎస్ఐ రాజేష్ తెలిపారు.

వారి వద్ద రూ 1,35000/- విలువగల 12 మోటర్లు స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇంకా కల్యాణ్ రాయ్ చెరువుల ఓనర్ అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.