గండికోట ఉత్సవాలకు.. సాదర ఆహ్వానం.

భారత్ న్యూస్ నెల్లూరు..కడప జిల్లా……

గండికోట ఉత్సవాలకు.. సాదర ఆహ్వానం

  • పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
  • ఈ నెల 11, 12, 13 తేదీలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

వైఎస్ఆర్ కడప, జనవరి 10 : మన గత చరితక వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే.. గండికోట ఉత్సవాలు -2026 లకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రావాలని.. జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా.శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.

శనివారం కలెక్టరేట్ లోని విసి హాలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, అందరూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానం పలుకుతూ.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వైఎస్ఆర్ కడప జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు-2026 లను నిర్వహిస్తోంది. చారిత్రిక వైభవాన్ని చాటి చెప్పేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం గండికోట ఉత్సవాలు-2026 లను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా అన్ని కార్యక్రమాలను రూపొందించాం.

మొదటి రోజు (11-01-2026) కార్యక్రమాలు :

సాయంత్రం 4:00 – 5:30 గం.వరకు – శోభాయాత్ర
సాయంత్రం 5:30 గం.లకు – గండికోట ఉత్సవాలు-2026 ప్రారంభోత్సవం
సాయంత్రం 6:30 – 7:00 గం.వరకు – గండికోట వారసత్వం, ఘన చరిత్ర…ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ జొన్నవిత్తుల
రామలింగేశ్వరరావు గేయాలాపన, చరిత్రకారులు శ్రీమతి డా. సగిలి సుధారాణి, శ్రీ తవ్వ ఓబుల్‌రెడ్డి ప్రసంగం
రాత్రి 7:10 – 7.20 గం. వరకు – గండికోట థీమ్ డ్యాన్స్
రాత్రి 7:20 – 7:35 గం. వరకు – థిల్లానా కూచిపూడి నృత్యం
రాత్రి 7:35 – 7:55 గం. వరకు – ముషాయిరా కవి సమ్మేళనం
రాత్రి 7:55 – 8:15 గం. వరకు – సౌండ్ & లేజర్ లైట్ షో
రాత్రి 8:15 – 9:45 గం. వరకు – నేపథ్య గాయని మంగ్లీచే సంగీత కచేరీ
రాత్రి 9:45 – 10:00 గం. వరకు – స్కై లాంతర్ ఫెస్టివల్

2వ రోజు (12-01-2026) కార్యక్రమాలు :

ఉదయం 10:00 – మ.2:00 గం.వరకు – గైడెడ్ హెరిటేజ్ వాక్
అడ్వెంచర్ యాక్టివిటీస్ – హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్ మొదలైనవి.
గ్రామీణ క్రీడా కార్యక్రమాలు – వ్యాలీబాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ,కవిత్వం, కథలు చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్,
వి.లాగింగ్, వంటల పోటీలు.
సాయంత్రం 4:00 – 5:00 గం. వరకు – కథా సదస్సు & గండికోట వైభవంపై డీకే, చదువుల బాబు, పి.బాలాజీ, తవ్వా ఓబుల్ రెడ్డి,
వై.మధుసూధన గారిచే ప్రసంగాలు.
సాయంత్రం 5:00 – 7:45 గం. వరకు – సాంస్కృతిక కార్యక్రమాలు,కూచిపూడి, బుర్రకథ, హరికథ, మ్యాజిక్ షో, అన్నమయ్య
సంకీర్తనలు, తోలుబొమ్మలాట మొదలైనవి.
రాత్రి 7:45 – 8:15 గం. వరకు – సౌండ్, లైట్ & లేజర్ షో
రాత్రి 8:15 – 9:45 గం. వరకు – రామ్ మిర్యాల చే మ్యూజికల్ నైట్ ప్రదర్శన

3వ రోజు (13-01-2026) కార్యక్రమాలు :
ఉదయం 10:00 – మ. 2:00 గం. వరకు – అడ్వెంచర్ యాక్టివిటీస్ – హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్., కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ,
స్కెచింగ్, పెయింటింగ్, వి.లాగింగ్, వంటల పోటీలు
సాయంత్రం 4:00 – 7:00 గం. వరకు – సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్ష
గానం, బృందావనం
సాయంత్రం 7:00 గంటలకు – సౌండ్, లైట్ & లేజర్ షో
రాత్రి 7:20 – రాత్రి 9:00 గం. వరకు – శివమణి చే మ్యూజికల్ నైట్ ప్రదర్శన
రాత్రి 9:00 గంటలకు – ఫైర్ వర్క్స్
రాత్రి 9:05 – 9:30 గం. వరకు – గండికోట ఉత్సవాల ముగింపు వేడుక