భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో డ్వాక్రా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు
అమరావతి :

ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 19వ వరకు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించనుంది. సఖి సురక్ష హెల్త్ కేర్ స్క్రీనింగ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో పొదుపు మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 35 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్క మహిళకు పరీక్షలు నిర్వహించనున్నారు.