ఏపీలో వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత

చేనేత కార్మికులకు మంత్రి సవిత శుభవార్త అందించారు.

ఆగస్టు 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కూలీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని సవిత ప్రకటించారు.

చేనేత కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.

అలాగే చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు కొత్తగా మరిన్ని ఆప్కో కేంద్రాలను అందుబాటు లోకి తీసుకురానున్నట్టు హామీ ఇచ్చారు.