భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల
📍గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

📍దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత సిలిండర్ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు.