భారత్ న్యూస్ తిరుపతి…ఏపీ త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!
ఏపీ బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. ‘ఇంద్రధనుస్సు’ పేరుతో ప్రకటించిన ఏడు ప్రధాన వరాలలో భాగంగా, ఆర్టీసీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 50% రాయితీని ఎత్తివేసి, మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పల్లెవెలుగు నుంచి డీలక్స్ సర్వీసుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. దాదాపు 7.6 లక్షల మందికి దీనివల్ల లబ్ది చేకూరనుంది.
