భారత్ న్యూస్ నెల్లూరు….5-17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాదిపాటు ఆధార్ అప్డేషన్
📍ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా అందించను న్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్ల లోపు పిల్లలు ఫొటోగ్రాఫ్, పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్ లో పేరు నమోదుచేసుకోవచ్చు. అయిదేళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోరు. పిల్లలు అయిదేళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఇలాంటి
ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏడాదిపాటు 5-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రూ.125 వసూలుచేస్తారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడంవల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొంద డానికి వీలవుతుందని పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల బయోమెట్రిక్స్ అప్ డేషన్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
