భారత్ న్యూస్ మంగళగిరి…అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్గా ముందుకెళ్ళాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌పై సీరియస్ గా దృష్టిపెట్టాలి. మనం కమిటీల నియామకాలు పకడ్భందీగా చేయాలి. ఎక్కడా పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతాం. రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పదాతి దళం సమర్ధవంతంగా పనిచేయాలి. కొన్ని విభాగాలు మరింత ఫోకస్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకెళ్ళగలుగుతాం. ఫైనల్‌గా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధుల విజయానికి బాటలు వేయాలి. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్దమవుతారు. అనుబంధ విభాగాలు కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాలపరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగేవారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్ గారిని సీఎం చేసుకుందాం.
