భారత్ న్యూస్ విజయవాడ…పాత ఎడ్లంక వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన విక్కుర్తి.
అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక వద్ద వరద పరిస్థితిని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పరిశీలించారు.
ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో శుక్రవారం సాయంత్రం ఎడ్లంక కాజ్ వే వద్ద వరద నీటి ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు. అవనిగడ్డ తహసిల్దార్ నాగమల్లేశ్వరరావును వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా గ్రామస్తులకు విక్కుర్తి భరోసానిచ్చారు.

కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్, విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, భూపతి నాంచారయ్య,బర్మా బుజ్జీ, బర్మా శ్రీనివాసరావు,రాజా, ఎస్ పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.