భారత్ న్యూస్ రాజమండ్రి…బాపట్ల జిల్లా చీరాల లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
విజయనగర్ కాలనీ వద్ద వాడరేవు..
పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులకు ఉపయోగిస్తున్న ఓ భారీ మొబైల్ క్రెన్ ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.మంటల్లో క్రెన్ ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైపోయింది..
ఘటన స్దలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..
ప్రమాదసమయంలో ఎవరు లేక పోవడం తో ప్రాణనష్టమే తప్పిందని కార్మికులు తెలిపారు..
అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేక ఏమి జరిగింది అనే కోణంలో ఫైర్ అధికారులు దర్యాప్తు చేపట్టారు..
