ఆంధ్రప్రదేశ్ రవాణాలో వేగవంతమైన కొత్త దశ ప్రారంభం,

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ – గూడూరు 3వ లైన్ ఆపరేషన్‌లోకిఆంధ్రప్రదేశ్ రవాణాలో వేగవంతమైన కొత్త దశ .

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో మరో మైలురాయి చరిత్ర సృష్టించింది. మొత్తం 292 కిలోమీటర్ల విజయవాడ – గూడూరు మూడో రైల్వే లైన్ ప్రాజెక్టులో ఇప్పటికే 281 కి.మీ. పూర్తయ్యి కమిషన్ (ప్రారంభం) అయింది. ఈ కొత్త లైన్‌తో దక్షిణ రైల్వే పరిధిలోని అత్యంత రద్దీ మార్గానికి పెద్ద ఊరటనిచ్చింది.

రద్దీ రూట్‌కి భారీ రిలీఫ్
ఈ లైన్ న్యూ ఢిల్లీ – చెన్నై, కోల్‌కతా – చెన్నై ప్రధాన కారిడార్‌లను అనుసంధానించే కీలక భాగం. మూడో లైన్ వల్ల ప్రయాణ ఆలస్యాలు తగ్గి, రైళ్ల వేగం గణనీయంగా పెరుగనుంది. ప్యాసింజర్‌ మరియు గూడ్స్‌ రైళ్లకు వేర్వేరు ట్రాక్‌లు లభించడం వల్ల ప్రయాణం ఇక మరింత సాఫీగా సాగనుంది.

కొత్త రైళ్లు – కొత్త అవకాశాలు
ఈ లైన్ ఆపరేషన్‌లోకి రావడంతో కొత్త ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌, ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యమవుతుంది. ప్రస్తుత రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుండడంతో ప్రయాణ సమయం తగ్గి, సమయపాలన మరింత మెరుగవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

పరిశ్రమలకు, రైతులకు శుభవార్త
రాష్ట్రంలోని నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఓంగోలు ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఈ లైన్ ఊతమివ్వనుంది. సరుకు రవాణా వేగవంతం కావడంతో వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఆహారం, పారిశ్రామిక వస్తువులు తేలికగా మార్కెట్‌లకు చేరుకోవడం సులభమవుతుంది. తీరప్రాంత పోర్టుల కనెక్టివిటీ మరింత బలపడనుంది.

తిరుపతి ప్రయాణికులకు పెద్ద వరం
తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ తగ్గి, చెన్నై – హైదరాబాద్ – తిరుపతి ప్రయాణాలు వేగవంతం కానున్నాయి. సీజన్ సమయంలో ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

సాంకేతికంగా అప్‌గ్రేడ్‌డ్‌ లైన్
ముడో లైన్ పూర్తిస్థాయిలో ఆధునిక సిగ్నలింగ్‌, హైస్పీడ్‌ ట్రాక్‌లు, ఎలక్ట్రిఫికేషన్‌, వంతెనల బలోపేతంతో సిద్ధమైంది. ఈ మార్పులు రైళ్ల సురక్షితంగా, వేగంగా నడవడానికి సహకరించనున్నాయి.

విజయవాడ–గూడూరు 3వ లైన్ పూర్తిగా ఆపరేషన్‌లోకి రాగానే — కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు అన్నింటికీ గణనీయమైన బూస్ట్‌ ఖాయం.