భారత్ న్యూస్ మంగళగిరి…ఎక్సైజ్ కమీషనర్ గా రాహుల్ దేవ్ శర్మ కు అదనపు బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ కమీషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫలితంగా రాహుల్ దేవ్ శర్మ ఇకపై డైరెక్టర్, ఎక్సైజ్ & ప్రొహిబిషన్; మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్; కమిషనర్, డిస్టిలరీస్ & బ్రూవరీస్ హోదాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
