ఉపాధి హామీ సామాజిక తనిఖీ

భారత్ న్యూస్ గుంటూరు…ఉపాధి హామీ సామాజిక తనిఖీ

17 విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని మంగళవారం నాడు కోడూరులోని ఉపాధి హామీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డ్వామా పిడి శివ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోడూరు మండల వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుండి గ్రామ సభల ద్వారా ఆడిట్ చేసిన వివరాలు, ఉపాధి హామీ ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి సామాజిక తనిఖీ యొక్క వివరాలు గురించి వివరించారు.

జడ్పిటిసి యాదవ రెడ్డి వెంకట సత్యనారాయణ, ఎంపీడీవో సుధా ప్రవీణ్, పి ఆర్ ఏ ఈ విజయ్ కుమార్,ఏపీడి రామ్మోహన్రావు, ఇన్చార్జి ఏపిఓ ఎస్ మజ్ను, తో పాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.