భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణాజిల్లా,
అవనిగడ్డ నియోజకవర్గం
అవనిగడ్డలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి…ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర.
కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందే శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో అవనిగడ్డ సెంటర్లో రచ్చబండ నిర్వహించిన షర్మిల.
పని హక్కు రక్షణ కోసం ఉపాధి హామీ కార్మికులతో,, ముఖాముఖిగా మాట్లాడిన షర్మిల.
రచ్చబండలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు.
రైతులు సమస్యలను షర్మిల దృష్టికి తీసుకువచ్చిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు.
రైతులు,కార్మికులకు వైయస్సార్ అండగా నిలబడ్డారు.
పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు.
గ్రామాల్లో పేదలకు ఉపాధి ఉండాలని… ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టీ…కరువు పని కల్పించారు.
ఉపాధి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా అమలు చేసింది.
అద్భుతమైన చట్టాన్ని…బీజేపీ ప్రభుత్వం బ్రస్టు పట్టించింది.
చేసిన పనికి కూడా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు….
గ్రామీణ ప్రజల హక్కు కోసం కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది.
బిజెపి తెచ్చిన విబి జిరాంజీ కొత్త చట్టం…వల్ల ప్రజలతో పాటు రాష్ట్రాలు నష్టపోతాయి.
గుండు సున్నాలా ఉపాధి హామీ పనిని మార్చారు.
కొత్త చట్టంలో 125రోజులు పని కల్పిస్తామనడం… పచ్చి బూటకం.

దరిద్రమైన చట్టానికి… సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వడం దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరీతోపాటు కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.