భారత్ న్యూస్ విజయవాడ…ఉపాధి హామీకి 740 కోట్ల మెటీరియల్ నిధుల విడుదల
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద ప్రభుత్వం రూ.740 కోట్లు విడుదల చేసింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.480.87 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 259.13 కోట్లుగా పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో విడతలో మొదటి ట్రెంచి కింద ఈ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి.

దీంతో గతేడాది అక్టోబర్ వరకు పెండింగులో ఉన్న బిల్లులు చెల్లింపునకు మార్గం సుగమం అయ్యింది.