భారత్ న్యూస్ రాజమండ్రి…గాలి ద్వారా కరెంట్ సరఫరా !ఫిన్లాండ్ సైంటిస్టుల ఘనత
గాలి ద్వారా కరెంటును సరఫరా చేయడానికి తొలుత అల్ట్రాసానిక్ శబ్ద తరంగాలను, లేజర్లు, ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని శాస్త్రవేత్తలు సిద్ధం చేసుకొన్నారు. అకోస్టిక్ వైర్‌గా (అదృశ్య వైరు) పిలిచే ఈ ప్రత్యేక ఛానల్ గుండా కరెంటును లక్షిత ప్రాంతానికి పంపించారు. విద్యుత్తును కాంతిగా మార్చి అనంతరం మళ్లీ విద్యుత్తుగా బట్వాడా చేయడంలో లేజర్లు కీలకంగా పని చేశాయని పరిశోధకులు తెలిపారు.
ఎలక్ట్రానిక్, స్మార్ట్ డివైజ్‌లు పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత తక్కువ మోతాదు కలిగిన కరెంటును తాజా ప్రయోగంలో పంపించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ప్లగ్స్, వైర్లు, కేబుల్స్‌ను ఏ మాత్రం వినియోగించలేదని గుర్తు చేశారు. ఎక్కువ స్థాయిలో కరెంటు సరఫరాకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు
