భారత్ న్యూస్ శ్రీకాకుళం…జగన్ చుట్టూ అష్టదిగ్బంధనం?
వైసీపీ అధినేత జగన్ అరెస్టుపై కొన్నాళ్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనను తప్పకుండా అరెస్టు చేస్తారని.. రేపో మాపో.. అన్నట్టుగా ఉందని కొన్నాళ్లు.. కాదు.. ఈ వారం, ఈ నెలలోనే అరెస్టు చేస్తారని.. టీడీపీ అనుకూల మీడియాల్లోనూ కథనాలు వచ్చాయి. కానీ.. నెలలు జరుగు తున్నా.. జగన్ అరెస్టుపై మాత్రం ఎలాంటి ప్రకటనా రావడం లేదు. ఎక్కడా దానికి సంబంధించిన దూకు డు నిర్ణయం కూడా కనిపించడం లేదు. కానీ.. ప్రస్తుతం ఈ విషయంపై టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోం ది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. దీనిని సీరి యస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలను సేకరించడంతోపాటు బలమైన వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది ఇప్పటి వరకు 40కి పైగా నిందితులను గుర్తించింది. 11మందిని కూడా అరెస్టు చేసింది. అయితే.. వీరు ఇచ్చిన వాంగ్మూలాలతో జగన్‌పై కేసు పెట్టేందుకు అవకాశం ఉందన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట. కానీ, చిన్న చిన్న వ్యక్తుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్నా.. వాటి ఆధారంగానే జగన్‌ను అరెస్టు చేయరాదన్నది చంద్రబాబు ఆలోచన.
ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారాన్ని సిట్ అదికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈయనను అరెస్టు చేసి.. తద్వారా ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిని ఈ కేసులో ప్రధాన వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు. మిథన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా జగన్ పై చర్యలు తీసుకుంటే.. అది మరింత బలంగా ఉంటుందని ఇటు ప్రభుత్వం, అటు అధికారులు కూడా భావిస్తున్నారు. దీనికితోడు మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించనున్నారు.
ఇలా మొత్తంగా అన్నివైపుల నుంచి బలమైన ఆధారాలను, సాక్ష్యాలను సేకరించిన తర్వాత.. జగన్ చుట్టూ అష్టదిగ్బంధనం ఏర్పాటు చేసి.. అప్పుడు అదుపులోకి తీసుకుంటారన్నది ఒకటాక్. మరోవైపు.. సాధ్య మైనంత వరకు జగన్ ఇమేజ్‌ను తగ్గించి.. ప్రజల్లో సానుభూతి లేని సమయం చూసుకుని ఆయనను అరెస్టు చేయాలన్నది మరో కోణంగా ఉందని చెబుతున్నారు. లేని పక్షంలో జగన్‌పై సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందన్నది మరో లెక్క. ఎలా చూసుకున్నా.. అన్ని కోణాల్లోనూ దీనిపై ప్రభుత్వంలో తీవ్ర చర్చేసాగుతోందని తెలుస్తోంది.
