భారత్ న్యూస్ గుంటూరు…రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్‌ల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ నైపుణ్యాలు పెంపొందించే అంశాల్లో సహకారం అందించాలని మంత్రి కోరారు.
