విద్యతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలి

భారత్ న్యూస్ విశాఖపట్నం..విద్యతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలి

గురుకుల పాఠశాల బాలికలకు SI దుర్గాంజనేయులు సూచన

చల్లపల్లి:
బాలికలు విద్యతోపాటు వారి కోసం ఏర్పాటుచేసిన చట్టాలపై కూడా అవ గాహన పెంచుకోవాలని చల్లపల్లి ఎస్ఐ దంపనపూడి దుర్గాంజనేయులు విద్యార్ధినులకు సూచించారు. స్థానిక నారాయణరావునగర్ లోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులకు పోక్సో చటంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఐ దుర్గాంజనేయులు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మంచి, చెడు స్పర్శలపై కూడా అవగాహన పెంచుకోవాలని వివరించారు. ఏదైనా ఆపద సందర్భాలు ఎదురైతే వెంటనే. టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లకు డయల్ చేయాలని వివరించారు. అలాగే మొబైల్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ రక్షణ కోసం శక్తియాప్ను డైన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఒమెన్ పిసి నాంచారమ్మ, పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.