ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు

భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు

వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే రూ.లక్ష రుణం.

స్త్రీనిధి కింద అందజేత.

రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం.

పథకం ఎవరికి వర్తిస్తుందంటే..

డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలికి.

ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి.

బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అమలు ఇలా..

గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు.

రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు (గరి ష్ఠంగా) రుణసాయం అందిస్తారు.

పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజుకు అను గుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు.

4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు.

తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48. వాయిదాల్లో చెల్లించాలి.

అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్ స్టిట్యూట్ వివరాలు, రసీదును సమర్పించాలి.

దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.

ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి అమలు ఇలా..

సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది.

అవసరానికి అనుగుణంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు (గరిష్ఠంగా) రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది.

4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు.

తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి.

లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధిం చిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రా లను సమర్పించాలి.

వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు.