భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.
