తిరుపతిలో డ్రగ్స్ కలకలం.. ఇంజక్షన్‌లతో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యువకులు*

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతిలో డ్రగ్స్ కలకలం.. ఇంజక్షన్‌లతో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యువకులు*

తిరుపతిలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. నగరంలోని ఇరిగేషన్ ఆఫీస్ వెనకాల ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లాలో యువకులు ఇంజక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు గుర్తించారు.

డ్రోన్ కెమెరాతో యువకులను గుర్తించి వారి దగ్గరకు వెళ్లారు. పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి చాకచక్యంలో లోపలకు వెళ్లగా ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. పోలీసులు వారిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో ఎక్కడ డ్రగ్స్ వాడినా వదిలిపెట్టేది లేదని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలోనూ తిరుపతిలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు నిఘా పెంచి డ్రగ్స్ మత్తును వదిలిస్తున్నారు.