ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్..

భారత్ న్యూస్ కడప ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్..

మద్యం షాపుల వద్దే పర్మిట్ రూమ్లు!

ఏపీలో మందు బాబులకు ఎక్సైజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాండెడ్ మద్యంతో పాటుగా రూ.99 కే క్వార్టర్ మద్యం అమ్మకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ లో బార్ల పాలసీ ప్రకటించనుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం రాబట్టుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టిందని
సమాచారం.